మొయిన్‌ అలీతో డేవిడ్‌ వార్నర్‌ గొడవ? | David Warner Post Match Moment In PSL Stuns Fans Later Clarification | Sakshi
Sakshi News home page

PSL: మొయిన్‌ అలీతో డేవిడ్‌ వార్నర్‌ గొడవ?

Apr 3 2026 12:27 PM | Updated on Apr 3 2026 12:55 PM

David Warner Post Match Moment In PSL Stuns Fans Later Clarification

PC: X

ఆస్ట్రేలియా వెటరన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘మీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు భాయ్‌’’ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

హాఫ్‌ సెంచరీ
డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)తో బిజీగా ఉన్నాడు. కరాచీ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధనాధన్‌ దంచికొట్టాడు. ఓపెనర్‌గా వచ్చిన వార్నర్‌ 36 బంతుల్లో 50 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడికి తోడు ఆజం ఖాన్‌ (34 బంతుల్లో 74) రాణించడంతో కరాచీ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

మొయిన్‌ అలీతో గొడవ?
ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం డేవిడ్‌ వార్నర్‌ సహచర ఆటగాడు మొయిన్‌ అలీతో సీరియస్‌గా ఏదో అన్నట్లు కనిపించింది. ఇంతలో కరాచీ టీమ్‌ డైరెక్టర్‌ హైదర్‌ అజర్‌ వచ్చాడు. వార్నర్‌ భుజంపై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. అతడి చేయిని తీసేసిన వార్నర్‌ పక్కకు వెళ్లమని సైగ చేశాడు.

క్లారిటీ ఇచ్చిన వార్నర్‌
ఆ తర్వాత మరోసారి హైదర్‌ వార్నర్‌ భుజాలపై చేయి వేసి నడిపించగా.. అటూ ఇటూ చూపిస్తూ వార్నర్‌ అతడికి ఏదో వివరించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కాగా.. వార్నర్‌ తాజాగా స్పందించాడు. 

‘‘ముందు వెళ్లి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయమని నేను హైదర్‌కు చెప్పాను’’ అని వార్నర్‌ స్పష్టం చేశాడు. తాను సరదాగా చేసిన పనిని అపార్థం చేసుకున్నారని పేర్కొన్నాడు.

మరోవైపు.. హైదర్‌ అజర్‌ ఈ వైరల్‌ దృశ్యాలపై స్పందిస్తూ.. ‘‘ఇందులో నిజం లేదు. వాళ్లిద్దరు (వార్నర్‌, అలీ) నాతో మజాక్‌ చేస్తున్నారు అంతే’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిన తర్వాత వీరు వివరణ ఇవ్వడం గమనార్హం.

చదవండి: ముస్తాఫిజుర్‌ రహమాన్‌ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement