Babar Azam Says I Will Not Reveal It Conversation Virat Kohli in the 2021 T20 World Cup - Sakshi
Sakshi News home page

Babar Azam- Virat Kohli: టాస్‌కు ముందు కోహ్లితో ఏం మాట్లాడానో ఎప్పటికీ బయటపెట్టను!

Published Mon, Dec 13 2021 9:53 AM

Babar Azam: I Will Not Reveal About Conversation Had With Virat Kohli T20 WC - Sakshi

T20 WC: Babar Azam Said He Will Not Reveal About Conversation With Kohli: టీ20 వరల్డ్‌కప్‌-2021 ఆసియా జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల పరిస్థితి ఎలా ఉన్నా... టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా... సెమీస్‌ వరకు చేరిన పాకిస్తాన్‌కు కూడా నిరాశ తప్పలేదు. అయితే, పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ కారణంగా క్రికెట్‌ ప్రేమికులకు రసవత్తర మ్యాచ్‌ చూసే అవకాశం మాత్రం దక్కింది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ జట్ల మధ్య చాన్నాళ్ల తర్వాత జరిగిన పోరులో విజయం ఎవరిదైనా... ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరి పట్ల ఒకరు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా టాస్‌ సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి సహా మెంటార్‌ ధోని పాక్‌ ఆటగాళ్లతో ముచ్చటించిన తీరు క్రీడాస్ఫూర్తిని చాటింది. అయితే, యూఏఈలో విజయానికి కీలకంగా మారిన టాస్‌ వేయడానికి ముందు ఇరు జట్ల సారథులు కోహ్లి, బాబర్‌ ఆజం ఏం మాట్లాడుకున్నారా అన్న విషయం గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 


PC: ICC
చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్‌

ఇదే విషయం గురించి తాజాగా బాబర్‌ను ప్రశ్నించగా.. ‘‘మేమేం చర్చించుకున్నామో ఎప్పటికీ బయటపెట్టను.. బహిరంగంగా అందరి ముందు ఆ విషయం గురించి మాట్లాడను’’ అని సామా టీవీతో అతడు వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో.. ‘‘సరేలే చెప్పకపోతే చెప్పకపోయావ్‌.. ఏదైతేనేం... కప్‌ గెలవలేకపోయారు... ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ ఆజం బృందం.. కోహ్లి సేనను ఓడించిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుపై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మెగా టోర్నీలో బాబర్‌ ఆజమ్‌... ఆరు ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి సత్తా చాటాడు. 

చదవండి: Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!

Advertisement
Advertisement