ఆసీస్‌ విజయం

Australia Women Cricket Team Won First T20 Against New Zealand Team - Sakshi

కివీస్‌తో తొలి టి20 మ్యాచ్‌

బ్రిస్బేన్‌: న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ ఏడాది మార్చిలో భారత్‌తో టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ తర్వాత ఆస్ట్రేలియా ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యాష్లీ గార్డ్‌నర్‌ (41 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్‌ లానింగ్‌ (24), రాచెల్‌ హేన్స్‌ (23) సహకరించారు. కెప్టెన్‌ సోఫీ డివైన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులే చేయగలిగింది. సుజీ బేట్స్‌ (38 బంతుల్లో 33; 2 ఫోర్లు), సోఫీ డివైన్‌ (29) ఫర్వాలేదనిపించారు. రెండో టి20 నేడు జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top