భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు.. షూటర్‌ నంబర్‌ 17 | Asian Olympic Qualifiers: Shooter Vijayveer Sidhu Clinches 17th Paris Olympics Spot For India | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు.. షూటర్‌ నంబర్‌ 17

Published Sun, Jan 14 2024 10:55 AM | Last Updated on Sun, Jan 14 2024 11:16 AM

Asian Olympic Qualifiers: Shooter Vijayveer Sidhu Clinches 17th Paris Olympics Spot For India - Sakshi

జకార్తా: పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేశాడు. దీంతో భారత్‌ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో విజయ్‌వీర్‌ శనివారం రజత పతకం గెలుచుకున్నాడు. అయితే పతకం గెలుచుకోవడానికి ముందే అతనికి ఒలింపిక్‌ బెర్త్‌ ఖాయమైంది.

క్వాలిఫయింగ్‌ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్‌ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్‌ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. మరో వైపు మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఈ ఈవెంట్‌లో సిఫ్ట్‌కౌర్‌ రజతం గెలుచుకోగా, ఆషి చౌక్సీకి కాంస్యం దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement