IND Vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా కోహ్లి!

ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న పాకిస్తాన్, టీమిండియా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దుబాయ్‌లోని షేక్ జాయెద్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. కాగా టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా.. కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Photo Credit: Reuters
అయితే శుక్రవారం రోహిత్.. కోహ్లితో కలిసి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సుధీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌కు జతగా విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశముందని.. కేఎల్ రాహుల్ డిమోట్ అయి వన్‌డౌన్‌లో రానున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కేఎల్ రాహుల్ డిమోషన్‌కు కారణం లేకపోలేదు.
Photo Credit: Reuters
ఇటీవలే జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి బ్యాటర్‌గా రాణించలేకోపోయాడు. గాయంతో చాలాకాలం టీమిండియాకు దూరమైన రాహుల్.. ధావన్‌తో కలిసి చివరి రెండు వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ వరుసగా 1, 30 పరుగులు మాత్రమే చేశాడు. కాగా 30 ఏళ్ల కేఎల్ రాహుల్ బ్యాటింగ్ రిథమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. టెక్నిక్ బాగానే ఉన్నప్పటికి భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు.
Photo Credit: Reuters
దీనికి తోడూ గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, కేఎల్ రాహుల్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ గోల్డెన్ డక్ కాగా.. కేఎల్ రాహుల్ మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఇదంతా అభిమానుల ఊహాగానాలు మాత్రమే. ఆదివారం(ఆగస్టు 28) పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్ ద్వారా రోహిత్‌కు జతగా కోహ్లి, రాహుల్‌లో ఎవరు రానున్నారనేది తేలిపోనుంది.
చదవండి: IND Vs PAK: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్ దూరం!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు