ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌.. | Ashleigh Gardner gets engaged to long-term girlfriend | Sakshi
Sakshi News home page

#Ashleigh Gardner: ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌

Apr 20 2024 6:30 AM | Updated on Apr 20 2024 6:30 AM

Ashleigh Gardner gets engaged to long-term girlfriend - Sakshi

PC: Cric Times

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్  తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్‌ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోల‌ను గార్డ్‌న‌ర్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంట‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కాగా గార్డ్‌న‌ర్‌, మోనికాలు 2021 నుంచి ప్రేమ‌లో ఉన్నారు. గార్డ్‌న‌ర్‌ను సపోర్ట్‌ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది.

2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement