IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్‌..!

Ashish Nehra Set To Become Ahmedabad IPL Team Head Coach - Sakshi

Ashish Nehra: ఐపీఎల్‌ 2022 ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు హెడ్‌ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని, మెంటార్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ఎంపిక లాంఛనమేనని ఫ్రాంఛైజీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. 

మరోవైపు కోచ్‌, సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో మరో అరంగేట్రం జట్టు లక్నో ఓ రెండు అడుగులు ముందే ఉంది. ఆ జట్టు తమ ఫ్రాంఛైజీ హెడ్‌ కోచ్‌గా జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌ను, మెంటర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసుకుంది. 

కాగా, లక్నో జట్టును ఆర్‌పీఎస్‌జీ గోయెంకా గ్రూప్ గ్రూప్‌ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్‌ జట్ల సంఖ్య 8కి చేరింది.
చదవండి: కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top