APL 2022 GOD Vs BZW: తడబడిన టైటాన్స్‌.. బెజవాడ టైగర్స్‌ గెలపు.. ఏకంగా..

APL 2022: Bezawada Tigers Beat Godavari Titans By 6 Wickets - Sakshi

తడబడిన టైటాన్స్‌

ఆరు వికెట్ల తేడాతో బెజవాడ టైగర్స్‌ విజయం

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా సెంట్రల్‌ ఆంధ్ర ఫ్రాంచైజీ జట్లు బెజవాడ టైగర్స్‌, గోదావరి టైటాన్స్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది.  టైటాన్స్‌ కెప్టెన్‌ శశికాంత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ వంశీకృష్ణ(10)ను 25 పరుగుల వద్ద అయ్యప్ప క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

5.5ఓవర్లలో 50పరుగుల మార్కు దాటిన అనంతరం మరో ఓపెనర్‌ హేమంత్‌ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగుల వద్ద లలిత్‌ బౌలింగ్‌లో అయ్యప్పకు క్యాచ్‌ఇచ్చి వెనుతిరిగాడు. చివరికి 18.5 ఓవర్లలోనే 119 పరుగులు స్కోర్‌కే టైటాన్స్‌ ఆలౌటైంది.

కెప్టెన్‌ శశికాంత్‌ ఒకఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేయగా నితీష్‌ 15, సందీప్‌ 22, ధీరజ్‌ 10 పరుగులు చేయగలిగారు. అయ్యప్ప ,లలిత్‌మోహన్‌ మూడేసి వికెట్లు తీయగా సాయిరాహుల్‌ రెండు, మనీష్, రికీబుయ్‌ చెరో వికెట్‌ తీశారు. 

120 పరుగుల లక్ష్యంతో... 
120 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన బెజవాడ టైగర్స్‌ జట్టు ఓపెనర్‌ మహీప్‌ మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి 4.4 ఓవర్ల వద్ద వెనుతిరిగాడు. మరో ఓపెనర్‌ సుమంత్‌కు వన్‌డౌన్‌లో విశాఖకు చెందిన అవినాష్‌ తోడై స్కోర్‌ను రెండో వికెట్‌కు 84 పరుగులకు చేర్చారు.

అవినాష్‌ రెండు ఫోర్లు,నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి వాసు బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.  కెప్టెన్‌ రికీబుయ్‌ (ఒక ఫోర్, మూడు సిక్సర్స్‌తో)13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 17.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి బెజవాడ టైగర్స్‌ విజయాన్ని అందుకుంది.

నితీష్‌ వేసిన బంతిని స్ట్రయిట్‌గా లాంగ్‌ఆన్‌ మీదుగా గాల్లో బౌండరీకి తరలిం సుమంత్‌ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు) జట్టుకు విజయాన్ని అందించాడు. లలిత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది వ్యచ్‌గా నిలవగా... బెస్ట్‌ బ్యాటర్‌గా అవినాష్, బెస్ట్‌ బౌలర్‌గా వాసు నిలిచారు.

ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్‌ 
ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్‌ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్‌ వారియర్స్‌ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్‌ 6  పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్‌ రైడర్స్‌ 4 పాయింట్లు సాధించింది.

చదవండి: APL 2022: వైజాగ్‌ వారియర్స్‌ పరుగుల వరద.. రెండో విజయం! 
Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్‌ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్‌ దేవ్‌...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top