జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ | Angkrish Raghuvanshi sizzles century in practice game to give Rahane headache before IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

Mar 21 2026 1:23 PM | Updated on Mar 21 2026 2:00 PM

Angkrish Raghuvanshi sizzles century in practice game to give Rahane headache before IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్ కోసం మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తీవ్రంగా శ్రమి‍స్తోంది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన కేకేఆర్‌.. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో శుక్రవారం కేకేఆర్ సభ్యులు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడాడు.  గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్‌ కెప్టెన్‌ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు కివీ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు. ఫ‌లితంగా ల‌క్ష్యాన్ని పర్పుల్ నైట్స్ జ‌ట్టు 19.2 ఛేదించింది.

అయితే ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌ఘువంశీ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. గ‌త సీజ‌న్‌లో కొన్ని సార్లు మూడో స్ధానంలో, మ‌రికొన్ని మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చేవాడు. అయితే ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్య ర‌హానే, కామెరాన్ గ్రీన్ వంటి టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు ఉండ‌డంతో ర‌ఘువంశీని మ‌రి ఎలా ఉప‌యోగిస్తారో చూడాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement