'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌ | Virat Kohli's Big Warning For RCB Teammates Ahead Of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌

Mar 21 2026 12:22 PM | Updated on Mar 21 2026 12:39 PM

Virat Kohli's Big Warning For RCB Teammates Ahead Of IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్‌ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. 

రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్‌, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. 

కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్‌లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి.  ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. 

కాగా ఆర్సీబీ తొలి టైటిల్‌ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్‌లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లోనూ ఆర్సీబీ విరాట్‌ కీలకం కానున్నాడు.
చదవండి: IPL 2026: దుమ్ములేపిన ప‌ప్పు యాద‌వ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే

Advertisement
 
Advertisement
Advertisement