దుమ్ములేపిన ప‌ప్పు యాద‌వ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే | Pappu Yadav's Son Gears Up For IPL In Style | Sakshi
Sakshi News home page

IPL 2026: దుమ్ములేపిన ప‌ప్పు యాద‌వ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే

Mar 21 2026 8:37 AM | Updated on Mar 21 2026 9:30 AM

Pappu Yadav's Son Gears Up For IPL In Style

ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ త‌మ ప్రాక్టీస్ జోరు పెంచింది. శుక్ర‌వారం కేకేఆర్ ఆట‌గాళ్లు రెండు జ‌ట్ల‌గా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్‌ కెప్టెన్‌ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు.

అయితే ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఆట‌గాడు, ఎంపీ పప్పు యాద‌వ్ త‌న‌యుడు సార్థ‌క్ రంజ‌న్ విధ్వంసం సృష్టించాడు. తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గోల్డెన్ నైట్స్' జట్టు తరపున ఆడిన సార్థక్‌​.. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు. వైభ‌వ్ ఆరోరా వేసిన మూడో ఓవ‌ర్‌లో అత‌డు ఏకంగా 20 ప‌రుగులు పిండుకున్నాడు.

ఆఖ‌రికి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కు సార్థ‌క్ రంజ‌న్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌తో పాటు దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచ‌డంతో అత‌డికి ఈ అవ‌కాశం ద‌క్కింది. డొమాస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపిన సార్థ‌క్‌.. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదిక‌పై స‌త్తాచాటేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు.

ఐపీఎల్‌-2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, ఎఫ్ గ్రీన్ అరోరా, వరుణ్ చకరన్, ఎఫ్. పతిరణ, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.
చదవండి: ఆర్‌సీబీ టికెట్‌ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ

Advertisement
 
Advertisement
Advertisement