బధిర మహిళల టి10 టోర్నమెంట్
గురుగ్రామ్: ఆంధ్రప్రదేశ్ బధిర మహిళల క్రికెట్ జట్టు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఐడీసీఏ మహిళల టి10 జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆంధ్ర 5 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కాంతమ్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియా దీక్షిత్ ‘బెస్ట్ బౌలర్’గా నిలిచింది.


