World Athletics Championships 2022:100 మీటర్ల రేసులో అమెరికా అథ్లెట్స్‌ క్లీన్‌స్వీప్‌..

Americans sweep mens 100m podium at 2022 World Athletics  Championships - Sakshi

యుజీన్‌ (అమెరికా): ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్స్‌ క్లీన్‌స్వీప్‌ చేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిపించారు. ఫ్రెడ్‌ కెర్లీ 9.86 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.

అమెరికాకే చెందిన మార్విన్‌ బ్రేసీ, ట్రేవన్‌ బ్రోమెల్‌ ఇద్దరూ 9.88 సెకన్లలోనే గమ్యానికి చేరగా... ఫొటో ఫినిష్‌ ద్వారా బ్రేసీకి రజతం, బ్రోమెల్‌కు కాంస్యం ఖాయమయ్యాయి. దాంతో 1991 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో మళ్లీ క్లీన్‌స్వీప్‌ నమోదైంది. 1991లో కార్ల్‌ లూయిస్, లెరాయ్‌ బరెల్, డెనిస్‌ మిచెల్‌ అమెరికాకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు.
చదవండిWorld Athletics Championships 2022: ఫైనల్లో ఏడో స్థానంతో సరిపెట్టిన శ్రీశంకర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top