WC 2023: భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ కాదు.. వరల్డ్‌కప్‌ విజేత ఆ జట్టే!

Afghanistan Can Win The World Cup: grame swan - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మాజీ క్రికెటర్‌లు మాత్రం ఇప్పటి నుంచే విజేత ఎవరన్నది అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్ స్వాన్ కూడా చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ను ఆఫ్గానిస్తాన్‌ సొంతం చేసుకోనే ఛాన్స్‌ ఉంది అని స్వాన్ అభిప్రాయపడ్డాడు.

స్పిన్‌ ట్విన్స్‌ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తమ​ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్‌ కచ్చితంగా విజేతగా నిలుస్తుందని స్వాన్‌ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌, నూర్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ ఏడాది సీజన్‌లో 30 వికెట్లు పడగొట్టారు. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ డిజిటిల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియో​సినిమాతో స్వాన్‌ మాట్లాడుతూ.. భారత్‌లో మణికట్టు స్పిన్నర్లను చూసి ప్రతీ దేశం ఆసూయపడాలి. ఆఫ్గానిస్తాన్‌ మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఆఫ్గాన్‌లో రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. వీరిద్దరూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్‌ జట్టు కచ్చితంగా ప్రపంచకప్‌ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top