ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే | Abhinav Mukund predicts the top four teams for IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే

Mar 26 2026 2:44 PM | Updated on Mar 26 2026 3:00 PM

Abhinav Mukund predicts the top four teams for IPL 2026

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌-19వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌ను భార‌త మాజీ ఓపెన‌ర్ అభిన‌వ్ ముకుంద్ అంచనా వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంద‌ని అత‌డు జోస్యం చెప్పాడు. 

కాగా గ‌తేడాది 17 ఏళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా గ‌త సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ సైతం ఈసారి  ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంద‌ని ముకుంద్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ రెండు జ‌ట్ల‌తో పాటు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తాయని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.

కాగా సీఎస్‌కే గ‌త రెండు సీజ‌న్ల‌లోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. కానీ ఈసారి మాత్రం 'యెల్లో ఆర్మీ', ఖచ్చితంగా టాప్-4లో ఉంటుందని ముకుంద్ భావిస్తున్నాడు. అయితే ముకుంద్ త‌న ఎంచుకున్న టాప్‌-4లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మూడు సార్లు ఛాంపియ‌న్ కేకేఆర్ జ‌ట్ల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
చదవండి: IPL 2026: మ‌రో 2 రోజుల్లో ఐపీఎల్‌.. అంతలోనే బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

Advertisement
 
Advertisement
Advertisement