భళా అభినవ్‌ దేశ్వాల్‌.. భారత్‌కు మరో స్వర్ణం | Abhinav Deshwal Win Mens 10m Air Pistol Gold At Deaflympics 2022 | Sakshi
Sakshi News home page

Deaflympics: భళా అభినవ్‌ దేశ్వాల్‌.. భారత్‌కు మరో స్వర్ణం

May 8 2022 8:54 AM | Updated on May 8 2022 8:56 AM

Abhinav Deshwal Win Mens 10m Air Pistol Gold At Deaflympics 2022 - Sakshi

న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో 15 ఏళ్ల అభినవ్‌ దేశ్వాల్‌ భారత్‌కు పసిడి పతకం అందించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్‌ ఫైనల్లో 234.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. బధిరుల ఒలింపిక్స్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన నాలుగో పతకమిది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ధనుష్‌ శ్రీకాంత్‌ స్వర్ణం, శౌర్య సైనీ కాంస్యం నెగ్గగా... మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో వేదిక శర్మ కాంస్యం సొంతం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement