breaking news
Deaf World Shooting Championship
-
భళా అభినవ్ దేశ్వాల్.. భారత్‌కు మరో స్వర్ణం
న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో 15 ఏళ్ల అభినవ్ దేశ్వాల్ భారత్‌కు పసిడి పతకం అందించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ ఫైనల్లో 234.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. బధిరుల ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు లభించిన నాలుగో పతకమిది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం, శౌర్య సైనీ కాంస్యం నెగ్గగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వేదిక శర్మ కాంస్యం సొంతం చేసుకుంది. -
ప్రియేషా దేశ్‌ముఖ్‌కు కాంస్యం
పుణే: తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ప్రియేషా దేశ్‌ముఖ్ కాంస్యంతో ఆకట్టుకుంది. రష్యాలోని కజాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో తను 10మీ. ఎరుుర్ రైఫిల్ విభాగం ఫైనల్లో 180.4 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. మూడేళ్ల క్రితమే కెరీర్‌ను ఆరంభించిన 23 ఏళ్ల ప్రియేషాకు ఇది తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం.