గుడ్‌ఫెలో క్లాసిక్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత అభయ్‌  | Sakshi
Sakshi News home page

గుడ్‌ఫెలో క్లాసిక్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత అభయ్‌ 

Published Mon, Feb 26 2024 4:23 AM

Abhay is the winner of Goodfellow Classic Squash Tournament - Sakshi

భారత స్టార్‌ ప్లేయర్‌ అభయ్‌ సింగ్‌ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఎ) సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్‌ టోర్నీలో అభయ్‌ సింగ్‌ విజేతగా నిలిచాడు.

40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్‌ 11–7, 11–9, 11–9తో మోరిస్‌ డేవ్‌రెడ్‌ (వేల్స్‌)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్‌కిది రెండో టైటిల్‌. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్‌ టోర్నీలోనూ అభయ్‌ టైటిల్‌ గెలిచాడు.   

Advertisement
Advertisement