ధోనిని వదలకుంటే సీఎస్‌కేకు 15 కోట్ల నష్టం

Aakash Chopra Comments On MS Dhoni Over His Play In IPL 2020 - Sakshi

ధోనిని విడుదల చేస్తేనే చెన్నైకి లాభం

అలా చేస్తే సీఎస్‌కేకు డబ్బులు మిగులుతాయి

మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌ అందించిన ధోని గతేడాది వన్డేకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2020లో అతడు ఆడతాడో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ధోని సీఎస్‌కే తరపున ఆడుతున్నట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక ఈ ఐపీఎల్‌ సీఎస్‌కే చెత్త ప్రదర్శన కారణంగా ఆటగాడిగా ధోని చివరి రోజులు లెక్కబెడుతున్నాడని, ఫిట్‌నెస్‌ కొల్పోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాక కెప్టెన్‌గా టీంను నడిపించడంలో మానసికంగా కూడా విఫలమయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా సైతం ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్‌లో ధోని ఆటను ఉద్దేశిస్తూ.. అతడిని వచ్చే ఐపీఎల్‌ వేలానికి విడుదల చేసి మళ్లీ తక్కువ రేటుకు కొనుగోలు చేసుకోండి’ అని సీఎస్‌కే యాజమాన్యానికి సూచించాడు. (చదవండి: ధోని కెప్టెన్సీ వదులుకుంటే.. అతడికే అవకాశం!)

చదవండి: ‘కడక్‌నాథ్’‌ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!

ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ... ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ సీఎస్‌కే మెగా ఆక్షన్(వేలంపాట) ఉన్నట్లైతే ధోనీని రిలీజ్ చేయమని చెన్నై జట్టు యాజమాన్యానికి చెప్పాడు. ఒకవేళ ధోనీని అలాగే ఉంచుకుంటే సీఎస్‌కే రూ. 15 కోట్లు నష్టపోతుందన్నాడు. కాబట్టి సీఎస్‌కే యాజమాన్యం ధోనీని వచ్చే ఏడాది ఆక్షన్‌ పూల్‌కు‌(వేలంపాట) విడుదల చేసి.. అక్కడ రైట్‌ టూ మ్యాచ్‌ కార్డును సీఎస్‌కే ఉపయోగించుకోవాలన్నాడు. అంటే ధోనిని మళ్లీ వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేసుకొమ్మని సీఎస్‌కేకు సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతడిని అలాగే ఉంచుకుంటే సీఎస్‌కే ధోనికి రూ. 15 కోట్లు చెల్లించుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో మాత్రం ఇలా చెప్తున్నాను తప్పా ధోనిని వదులుకొమ్మని కాదని స్పష్టం చేశాడు. ఈ విధంగా సీఎస్‌కే యాజమాన్యం చేస్తే చైన్నై జట్టుకు డబ్బులు మిగులుతాయని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. (చదవండి: చంపేస్తామంటూ బెదిరింపులు.. షకీబ్‌ క్షమాపణ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top