PSL 2023: ఇదేమి ఖర్మరా బాబు.. క్రికెట్‌ స్టేడియంలో కెమరాలు చోరీ! పాక్‌లో అంతే?

8 Security cameras stolen from Lahores Gaddafi Stadium - Sakshi

ప్రస్తుతం జరుగున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఈ ఏడాది ఈ లీగ్‌కు కరాచీ, ముల్తాన్‌, రావల్పిండి, లాహోర్‌ అతిథ్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు రావల్పిండి, లాహోర్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా జరగలేదు.

ఫిబ్రవరి 26(ఆదివారం) లాహోర్‌ క్యాలండెర్స్‌, పెషావర్ జల్మీ మ్యాచ్‌తో లాహోర్‌ లెగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ భద్రత కోసం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు  చోరికి గురయ్యాయి.  

సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

అదే విధంగా ఇందుకు సంబంధించి గుల్బర్గ్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫియర్‌, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగనుంది. ఈ క్రమంలో మరో సారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ టీమిండియాదే'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top