IPL 2022: ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

25 Percent Fans Set To Be Allowed Stadiums For The IPL 2022 Season - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభానికి మూడు రోజుల ముందు క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 25 శాతం ప్రేక్షకులకు అనుమతినిస్తూ ఐపీఎల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో బుధవారం పేర్కొంది. ఫ్యాన్స్‌కు ఇది సంతోషం కలిగించే విషయం.. ఎందుకుంటే ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభ వేడుకలను ఈసారి కూడా నిర్వహించడం లేదని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి ఫ్యాన్స్‌ను నిరాశ మిగిల్చింది.

అయితే ఒక్కరోజు వ్యవధిలోనే ఈసారి మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అయితే పూర్తిస్థాయి ప్రేక్షకులను కాకుండా కేవలం 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణే వేదికల్లో నిర్వహించనున్నారు. మార్చి 26న గత సీజన్‌ విజేత సీఎస్‌కే.. రన్నరప్‌ కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌తో సీజన్‌ ప్రారంభం కానుంది.


''ఐపీఎల్‌ 15వ సీజన్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నాం. అయితే కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం 25 శాతం మందికే ఎంట్రీ ఇచ్చాం. తమ అభిమాన క్రికెటర్ల ఆటను దగ్గర్నుంచి చూడాలనే అభిమానుల కోరికను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. కాగా ప్రోటోకాల్స్‌ కచ్చితంగా అమలవుతాయి. ''అంటూ ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. కాగా గతేడాది సీజన్‌లో తొలి అంచె పోటీలకు ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్లకు కరోనా సోకడం.. సిబ్బందిలో కూడా చాలా మందికి పాజిటివ్‌ అని తేలడంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత నవంబర్‌లో మళ్లీ ఐపీఎల్‌ రెండో అంచె పోటీలను నిర్వహించినప్పటికి ప్రేక్షకులను అనుమతించలేదు.

చదవండి: IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం: రషీద్‌ ఖాన్‌

IPL 2022: వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పటికీ అతడి పేరిట చెక్కు చెదరని రికార్డు! టాప్‌-5లో ఉన్నది వీళ్లే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top