
ఒక వైపు వృత్తి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ స్కూల్ పిల్లలకు అవసరమైన సలహాలు, టిప్స్‌ను సోషల్ మీడియా ద్వారా అందిస్తోంది ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్. తాజాగా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ మార్గంలో సైన్స్ సూత్రాలను అర్థం చేయించే టిప్స్‌ను షేర్ చేసింది.
పిల్లలకు భూభ్రమణం గురించి వివరించడానికి హ్యూమన్ సన్‌డయల్ ఎలా తయారు చేయాలి, ‘సింక్ అండ్ ఫ్లోట్ ఎక్స్‌పెరిమెంట్’ను వివరించడానికి నారింజలు, నీళ్లను ఎలా ఉపయోగించాలి... అనేవి ఇందులో ఉన్నాయి.
‘ఐఐటీ దిల్లీలో ఇంజినీరింగ్ చదువుకున్నాను. డిగ్రీ కంటే శాస్త్రీయ దృష్టి, విశ్లేషణ ముఖ్యం’ అంటుంది దివ్య మిట్టల్. ‘సూపర్ కలెక్షన్. ఫన్–టు–డూ. మీ పిల్లలు అదృష్టవంతులు. మీరు ఇచ్చిన టిప్స్‌ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి’ అని ఒక యూజర్ స్పందించాడు.