భర్త జూమ్‌ కాల్‌లో బిజీగా ఉండగా, భార్య ఏం చేసిందంటే..

Anand Mahindra Nominates A women As Wife Of The Year, After She Tried To Kiss Her Husband On Zoom Call - Sakshi

కరోనా పుణ్యమా అని వీడియో కాన్ఫరెన్స్‌లు బాగా పెరిగిపోయాయి. వీటివల్ల కొన్నిచోట్ల చిత్రవిచిత్రాలు జరిగి జనాలను తెగ నవ్విస్తున్నాయి. అందుకు చిన్న ఉదాహరణ ఇది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... ఒక ఉద్యోగి తన బాస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. ఈ లోపు సీన్‌లోకి సడన్‌గా ఆయన భార్య వచ్చింది. భర్తగారిని ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేసింది. కోరికోరి భార్య ముద్దిస్తుంటే ఏ భర్త అయినా వద్దంటాడా? కానీ ఆ భర్త వద్దన్నాడు. పైపెచ్చు తీవ్రంగా మండిపడ్డాడు.

‘కెమెరా ఆన్‌లో ఉంది. వాట్‌ నాన్‌సెన్స్‌ యూ ఆర్‌ డూయింగ్‌’ అని ఇంటికప్పుకు చిల్లులు పడేలా అరిచాడు. అప్పుడుగానీ భార్యకు మ్యాటర్‌ అర్థం కాలేదు. ఈ వీడియోను ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంక సరదాగా షేర్‌ చేశాడు. ఈ వీడియోను చూసి మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర మరింత సరదాగా ఇలా స్పందించాడు...‘ఈ మహిళను వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నామినేట్‌ చేస్తున్నాను’.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top