భూగర్భ జలాలు పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు పెంచేలా..

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

ఇంకుడుగుంతల నిర్మాణం ● జిల్లాలో 505 డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌లకు శ్రీకారం

ప్రభుత్వం జిల్లాల వారీగా ఇంకుడు గుంతల లక్ష్యాలను నిర్దేశించింది. సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలకు 506 గుంతలు లక్ష్యంగా పెట్టారు. గ్రామాల్లో వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై గతంలోనే అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామంలో ఏ కాలనీ నుంచి మురుగునీరు ఎక్కువగా వస్తోంది? ఆ నీరు ఎక్కడ మిగులుతుంది? అని పరిశీలించారు. కాలువ ముగిసే చోట ఇంకుడు గుంత నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉందా అన్న వివరాలను సేకరించారు.

పారిశుద్ధ్య సమస్యలకు చెక్‌

గ్రామాల్లో కాల్వల ద్వారా వచ్చే మురుగునీరు ఎక్కడో ఒకచోట పొర్లి పొలాల్లోకి చేరుతోంది. దీనివల్ల పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గిపోతుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌ నిర్మాణంతో పారిశుద్ధ్య సమస్య, దోమల బెడద తగ్గుతుందని అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గినా ఉన్న కొద్దిపాటి మురుగు నీటిని కూడా వృథా చేయకుండా భూమిలోకి పంపితే భూగర్భ జలమట్టం పెరుగుతుంది. నీరు వివిధ దశల్లో ఫిల్టర్‌ అయి భూమిలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా, నీటి భద్రత ఉంటుంది. ఇదే ఎల్‌నినోను ఎదుర్కొనే అస్త్రం అని అధికారులు భావిస్తున్నారు.

ఒక్కో దానికి రూ.96 వేల ఖర్చు

డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌ నిర్మాణానికి దాదాపు రూ.96 వేలు ఖర్చు పెట్టనున్నారు. దీని సామర్థ్యం 3 లక్షల లీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందులోకి చెత్త చేరకుండా నీరు మాత్రమే చేరేలా ఫిల్టర్లు ఏర్పాటు చేస్తారు. సిద్దిపేట జిల్లాలో 505 డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. పంచాయతీ పాలకవర్గం చొరవ చూపితే పనులు త్వరగా పూర్తవుతాయి. ఇటీవల జిల్లాలో నిర్మించిన డ్రైయిన్‌ అండ్‌ సోక్‌ పిట్‌లు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఎల్‌నినోకు చెక్‌పెట్టడంతోపాటుగా జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య సమస్యకు భూగర్భ జలాల పెంపుదలకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని పలు గ్రామాల్లో మురికి కాలువల గుండా నీరు పొలాల్లోకి చేరి పంట దిగుబడిని దెబ్బతీస్తుండటంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోపాటు, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదాన్ని ముందే ఊహించిన ప్రభుత్వం ‘డ్రైయిన్‌ అండ్‌ కమ్యూనిటీ సోక్‌ పిట్‌’ల పేరుతో ఇంకుడు గుంతలను నిర్మించనుంది. – దుబ్బాకటౌన్‌

మంచి సత్ఫలితాలు

డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌ల నిర్మాణంతో మురుగునీరు నిల్వ కాకుండా ఉంటుంది. దీంతో రోగాలు దరి చేరకుండా ఉంటాయి. ఊరి చివరన రైతులు పొలాలకి మురుగు నీరుతో ఇబ్బందులు పడుతున్న సమస్య తీరుతుంది. భూగర్భ జలాలను పెంచడానికి డ్రైయిన్‌ అండ్‌ సోక్‌పిట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement