జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి

మద్దూరు(హుస్నాబాద్‌): కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి డిమాండ్‌ చేశారు. మద్దూరు మండల కేంద్రంలో సీఐటీయూ, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, ప్రజానాట్యమండలి సంఘాల ఆధ్వర్యంలో జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ పేరుతో జ్ఞానేశ్‌కుమార్‌ నాయకత్వంలో ప్రతిపక్షం, ప్రశ్నించే వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారన్నారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని బాధ్యులైన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ ఎండీ షఫీ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement