కల్లు దుకాణాలపై తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

కల్లు దుకాణాలపై తనిఖీలు

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

కల్లు దుకాణాలపై తనిఖీలు

మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని పలు గ్రామాల్లో సిద్దిపేట జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో అమ్ముతున్న కల్లులో డైజోఫాం, క్లోరో ఫాం వంటి మత్తు పదార్థాలేమైనా వాడుతున్నారా అన్న కోణంలో తనిఖీలను ముమ్మరం చేశారు. లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్‌ అధికారి భిక్షాలు మాట్లాడుతూ లైసెన్స్‌ లేకుండా కల్లు దుకాణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే లైసెన్స్‌లు రద్దు చేసి, దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కల్లు శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించి తుది నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement