చేసిన పనులకు బిల్లులేవి? | - | Sakshi
Sakshi News home page

చేసిన పనులకు బిల్లులేవి?

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

హుస్నాబాద్‌రూరల్‌: ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక అధికారి కొండల్‌రెడ్డి అధ్యక్షత శుక్రవారం జరిగిన మండల అభివృద్ధి పనుల పై సమీక్షలో సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం కోసం మంజూరు చేసిన మహిళా భవనాల నిర్మాణం పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి కొండల్‌రెడ్డి అనడంతో సర్పంచ్‌లు చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రావడం లేదని మళ్లీ పనులు చేయాలంటే ఏం పెట్టి చేయమంటారని పలువురు సర్పంచ్‌లు ప్రశ్నించారు. పొట్లపల్లి, భల్లునాయక్‌ తండాలో భవన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించడం లేదన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు స్పందించడం లేదన్నారు. యువత బాగు పడాలని గ్రామాల్లో మద్యం అమ్మకాలను అరికట్టాలని మేం ప్రయత్నం చేస్తే ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిధులు తెస్తున్నారని, పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ జంగపెల్లి అయిలయ్య, ఎంపీడీఓ సురేశ్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

మండల సభలో సర్పంచ్‌ల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement