సిద్దిపేటఅర్బన్: మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన సుడా, రెవెన్యూ, అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని అర్బన్ మండల ప్రత్యేకాధికారి ఏడీఏ పద్మ స్పష్టం చేశారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీవో మార్టిన్ లూథర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అర్బన్ మండల సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతీ సమావేశానికి హాజరుకావాలని సమాచారం ఇచ్చినప్పటికీ హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సుడా, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. హాజరుకాని వివరాలను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ప్రతీ శాఖ పరిధిలోని సమస్యలను నోట్ చేసుకొని 45 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
అర్బన్ మండల సర్వసభ్య సమావేశానికి పలువురు డుమ్మా
అర్బన్ మండల ప్రత్యేకాధికారి పద్మ ఆగ్రహం


