కార్మిక హక్కులపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులపై అవగాహన తప్పనిసరి

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

సిద్దిపేటరూరల్‌: కార్మికులు పని చేయడంతోపాటుగా వారి హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో కార్మికుల హక్కులకు సంబంధించిన ‘మీ పని..మీ జీతం..మీ స్వేచ్ఛ’పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించి ప్రచార రథాన్ని అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...జిల్లాలో ఈ నెల 8 నుంచి 28 వరకు కార్మికుల హక్కులపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. కార్మికులు వారు పనిచేసే ప్రాంతాల్లో వేధింపులు, బెదిరింపులు, అన్యాయం ఎదురైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎక్కడైనా అన్యాయం, వేధింపులకు గురైనా 080–69434343 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్‌, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, లేబర్‌ ఆఫీసర్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement