ఆరోగ్య మూట | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మూట

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

హుస్నాబాద్‌లో వెల్లివిరిస్తున్న పచ్చదనం

ప్రగతి బాట..

● డివైడర్‌ మధ్యలో మొక్కలు

● క్రీడాకారులు, సూర్య నమస్కార విగ్రహాల ఏర్పాటు

హుస్నాబాద్‌: ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలనే సందేశాలతో హుస్నాబాద్‌ పట్టణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. డివైడర్ల మధ్య విగ్రహాలు, పచ్చని తోరణాలతో ఆహ్వానం పలికేలా చెట్లు అందరిని కనువిందు చేస్తున్నాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున డివైడర్లు నిర్మించారు. డివైడర్ల మధ్య దాదాపు 300 వరకు కాకినాడ నుంచి తెప్పించిన కాక్‌టాయిల్‌ పొడవాటి చెట్లు ఏర్పాటు చేశారు. వాటి మధ్య వివిధ రకాల పూల మొక్కలు నాటారు.

హుస్నాబాద్‌ పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ఒక్క చెట్టు కూడా కనిపించని పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పొడవాటి చెట్లతో పచ్చదనం వెల్లివిరుస్తుంది. ప్రతి రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పట్టణంలో జాతీయ రహదారి నిర్మించడంతో దుకాణాలు, ఇండ్ల ముందు ఉన్న చెట్లను తొలగించడంతో కాలుష్యం పెరిగింది. దీంతో డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన చెట్లతో వాతావరణ కాలుష్య నివారణను కొంతలో కొంతైనా అరికట్టవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. అందమైన చెట్లు, పలు రకాలు విగ్రహాలతో పట్టణం కొత్త శోభను సంతరించుకుంది.

సందేశం ఇచ్చేలా..

ప్రజలకు మంచి సందేశం ఇచ్చేలా డివైడర్లను తీర్చిదిద్దారు. డివైడర్ల మధ్య క్రీడాకారులు, సూర్య నమస్కారం చేసే విగ్రహాలు, పచ్చని చెట్లు ఏర్పాటు చేశారు. క్రీడలు, ఆరోగ్యం, పచ్చదనం.. నిత్య జీవితంలో పాటించేలా డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే సిద్దిపేట రోడ్డు నుంచి పట్టణ ప్రవేశం.. డివైడర్ల మధ్య క్రీడాకారుల విగ్రహాలు, హన్మకొండ రోడ్డు నుంచి పట్టణ ప్రవేశం వరకు డివైడర్ల మధ్య సూర్య నమస్కారం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రోడ్ల డివైడర్ల మధ్య పొడవాటి చెట్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement