దుబ్బాకటౌన్: చిన్నారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండం అందరినీ ఆకట్టుకుంది. దారాలతో ఎంతో ఓపికగా, నైపుణ్యంతో రూపొందించిన చిత్రపటాన్ని ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి బహూకరించి దౌల్తాబాద్ మండలంలోని ముబారాస్ పూర్ గ్రామానికి చెందిన చిన్నారులు హాసిని, నవదీప్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ సృజనాత్మకతకు పదును పెట్టి, దారాలతో ఎమ్మెల్యే చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం విశేషంగా నిలిచింది. చిత్రపటాన్ని చూసి ఎమ్మెల్యే ముగ్ధులై చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రుణం శ్రీ నివాస్‌గౌడ్, మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


