మర్పడ్గలో దుర్గాదేవి స్వరూపిణిగా..
దుర్గాదేవి అలంకారంలో వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో దసరాశరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం విద్యాసరస్వతి అమ్మవారు సకల సద్గతులు కలిగించే దుర్గాదేవిగా దివ్యదర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేషాభిషేకం జరిపి సర్వాభరణాలతో అలంకరించారు. చతుషష్ట్యుపచార, రాజోపచార పూజలు, పారాయణాలు, చండీహవనం నిర్వహించారు. గిరిప్రదక్షిణ చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దంపతులు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ దంపతులు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపించారు. అర్చకులు వారికి శేషవస్త్రం, అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు.
దుర్గాదేవి స్వరూపిణిగా విజయదుర్గమ్మ
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి స్వరూపిణిగా దర్శనమిచ్చారు. కలశ స్థాపన, చతుషష్ట్య ఉపచార పూజ, విశేష ఫలరస అభిషేకం, నవావరణ హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు.
దుర్గా మాతగా అమ్మవారు


