ఎల్నినో నుంచి పశు సంపదను కాపాడేందుకు కార్యాచరణ
ప్రస్తుత ఖరీఫ్లో సాగవుతున్న వరి పంటతో గడ్డి, మొక్కజొన్న, జొన్న పంటల నుంచి వచ్చే చొప్ప పశువులకు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు సరిపోతుంది. ఒకవేళ తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తి రబీ పంటలు సాగు కాని పక్షంలో 2027 జనవరి నుంచి పశుగ్రాసం కొరత తీవ్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో మూగజీవాలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆ శాఖ భావిస్తోంది.
కార్యాచరణ ప్రణాళిక ఇలా..
పాడి రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలు సరఫరా చేయడం. ఎకరానికి 20 కేజీల గడ్డి విత్తనాలు అవసరం ఉంటుంది. ఒక్కో పశువుకు రోజుకు ఐదు కేజీల గడ్డి చొప్పున రాష్ట్రంలో ఉన్న పశువుల సంఖ్యను సరిపడా ఈ విత్తనాలు సరఫరా చేయడం, చెరువులు, కుంటల శిఖం భూముల్లో ఉండే తేమతో ఈ పశుగ్రాసం పెరుగుతుంది. ఈ గ్రాసం పెంచడం ద్వారా పశువులకు గ్రాసం కొరతను అధిగమించవచ్చని రైతులకు అవగాహన కల్పించనున్నారు.
పకడ్బందీగా అమలు
కరువు కారణంగా సరైన పశుగ్రాసం దొరక్కపోవడం.. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధుల భారిన పడటంతో పశువులను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అల్లాన.. అల్కబీర్ వంటి పశు వధశాలలకు ఎక్కువ పశువులు వెళుతుంటాయి. దీన్ని డిస్స్ట్రెస్ సేల్గా భావిస్తారు. కరువుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని పశుసంవర్థకశాఖ భావిస్తోంది.
ఆవులు, ఎద్దులు 42.32 లక్షలు
గేదెలు 42.26 లక్షలు
గొర్రెలు 1.90 కోట్లు
మేకలు 49.34 లక్షలు
ప్రణాళిక సిద్ధం చేస్తున్న పశుసంవర్థకశాఖ
2027 జనవరి నుంచి జూన్ వరకు అమలు
వధశాలలకు తరలకుండా నివారణ చర్యలు
చాప్కట్టర్ల యంత్రాలపై రాయితీలు ఇవ్వడం. పరిమితమైన గ్రాసాన్ని చాప్ కట్టర్లతో కోయడం ద్వారా గ్రాసం వృధాను 50 శాతం నుంచి 95 శాతానికి తగ్గించవచ్చని భవిస్తున్నారు.
ఎండల తీవ్రతకు పశువులకు పౌష్టికాహార లోపానికి గురికాకుండా.. మినరల్ మిక్చర్ సబ్సిడీపై అందజేయడం, రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు మృత్యువాత పడకుండా పశువులకు టీకాలు వేయడం, పశువులకు హెల్తా క్యాంపులు నిర్వహించడం.
రాష్ట్రంలో పశు సంపద ఇలా..
ఎల్నినో ప్రభావంతో వచ్చే కరువు నుంచి పశు సంపదను కాపాడేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై పశు సంవర్థక శాఖ దృష్టి సారించింది. 2027 జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఈ అంశంపై కసరత్తు ప్రారంభించారు.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి


