మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజల మధ్య ఐక్యత, అనుబంధం, ఆత్మీయతకు ప్రతీక సద్దుల బతుకమ్మని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడబిడ్డల ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదని మన ప్రకృతి ఆరాధనకు, కుటుంబ అనుబంధాలకు, సామాజిక ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. బతుకమ్మ పండుగను కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించారన్నారు. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో, జరుపుకునే బతుకమ్మ పండుగ నేడు దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకునేస్థాయికి చేరుకుందన్నారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.
రైతులను
ఆదుకోవడంలో విఫలం
బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు
బెజ్జంకి(సిద్దిపేట): అన్నదాతలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు ఆరోపించారు. బెజ్జంకిలో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..రైతుల సంక్షేమాన్ని కేవలం మాటల్లో చూపిస్తున్నారన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని రైతులు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశంగౌడ్, సంగ రవి, పాల్గొన్నారు.
బతుకమ్మ సంబురాల్లో
జడ్జీ స్వాతి
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని ఐవోసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని కోర్టు ఆవరణ ముందు బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి జరిగిన బతుకమ్మ సంబురాల్లో గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.స్వాతి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
దూల్మిట్ట చెక్‌డ్యాం మరమ్మతులు
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండల కేంద్రంలోని చెక్‌డ్యామ్ మరమ్మత్తులకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇరిగేషన్ డీఈ శ్యామ్ తెలిపారు. శనివారం చెక్‌డ్యామ్‌ను ఇరిగేషన్ అధికారులు సందర్శించి మరమ్మతుల కోసం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ వర్షాలకు చెక్డ్యామ్తోపాటు కాజ్వే దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న కాజ్వే, డ్యామ్ మరమ్మతుల కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, డిజైన్ రూపొందించనున్నామని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే దూల్మిట్ట,లింగాపూర్ చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.
బాధ్యతలను గుర్తిస్తేనే మార్పు సాధ్యం
బీఆర్ఎస్ నేత తోట కమలాకర్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): యువత బాధ్యతలను గుర్తించి సత్ప్రవర్తనతో మెలిగితేనే సమాజంలో మంచి మార్పు లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మిరుదొడ్డిలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడు మార్గం పట్టకుండా ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశం చేస్తున్న అడ్వొకేట్ నేరండ్ల వెంకట్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మద్యానికి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. భవిష్యత్తును చక్కదిద్దుకోవడానికి పుస్తక పఠనం, క్రీడలు, నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు.


