దుబ్బాకరూరల్: మండలంలోని చీకోడ్ గ్రామంలో ఫాంపాండ్‌ను ఉద్యాన శాఖ ఏడీ శ్యామ్రాజ్రాథోడ్, అధికారి రమేశ్ పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్, ఇతర పండ్ల తోటలకు నీళ్లు వాడడానికి రైతులు తమ భూముల్లో ఫాంపాండ్‌ను నిర్మించుకోవాలన్నారు. 20 మీటర్ల పొడవు, వెడల్పు 20మీటర్లు, 3 మీటర్ల లోతుగా తీయలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా రూ.90వేలు సబ్సిడీ అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ములుగు(గజ్వేల్): గ్రామభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ములుగు మండలం గంగాధర్‌పల్లి సర్పంచ్ పూరెల్లి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా భవనానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. అవృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుదర్శన్, వార్డుసభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కోహెడరూరల్(హుస్నాబాద్): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభమయ్యాయి. గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి సర్పంచ్ బందేల సుజాత తో కలసి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యువత గంజాయి, ఆన్లైన్ గేమ్స్ వంటి వ్యవసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలతో పాటు ట్రోఫీలు అందజేస్తామన్నారు.
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తుల సమక్షంలో దాత బొబ్బల మోహన్‌రెడ్డి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొబ్బల మోహన్‌రెడ్డి రూ.5లక్షల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మోహన్‌రెడ్డి చొరవను అభినందించారు. ఆయన స్పూర్తితో గ్రామానికి చెందిన పలువురు తమ వంతుగా ఆర్థిక సహయం అందజేయాలన్నారు.
కొండపాక(గజ్వేల్): పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, అలాంటి వారిని సన్మానించడం ఎంతో తృప్తి నిచ్చిందని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆలు భద్రప్ప అన్నారు. కుకునూరుపల్లిలోని తిప్పారంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో వస్త్రాలతో పాటు పండుగ సరుకులను పంపిణీ చేసి సత్కరించారు. ఈసందర్భంగా భద్రప్ప మాట్లాడుతూ గ్రామాల్లో మురికి కాలువలు, రోడ్లపై చెత్తా చెదారం లేకుండా శుభ్రపరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీశాల నవీన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


