బస్‌డిపోకు అదనపు బస్సులు | - | Sakshi
Sakshi News home page

బస్‌డిపోకు అదనపు బస్సులు

Oct 17 2026 11:16 AM | Updated on Oct 17 2026 11:16 AM

బస్‌డిపోకు అదనపు బస్సులు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

మంత్రి వివేక్‌ హామీ

దుబ్బాక: స్థానిక బస్‌డిపోకు శాశ్వత డిపో మేనేజర్‌తో పాటు అదనపు బస్సులు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వివేక్‌ వెంకటస్వామి హామీ ఇచ్చారు. శుక్రవారం దుబ్బాక ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికై న మచ్చ శ్రీనివాస్‌ను నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి సన్మానించారు. దుబ్బాక బస్సుడిపోకు డీఎం లేకపోవడం, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు పలు సమస్యలను మంత్రికి వివరించారు. దీంతో స్పందించిన మంత్రి తప్పకుండా డిపో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కౌన్సిలర్లు తునికి సురేశ్‌, కాల్వ నరేష్‌, శ్రీరాం నరేందర్‌, భరత్‌ తదితరులు ఉన్నారు.

వర్గల్‌(గజ్వేల్‌): రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గజ్వేల్‌ విద్యుత్‌ డీఈ స్వామి అన్నారు. శుక్రవారం వర్గల్‌లోని బుచ్చిరోనికుంట ట్రానన్స్‌ఫార్మర్‌, సమీప వ్యవసాయ పొలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి విద్యుత్‌ సమస్యలను తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఓవర్‌లోడ్‌ లేకుండా 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే ఏర్పాటు చేశారు. నాణ్యమైన విద్యుత్‌, మెరుగైన విద్యుత్‌ సరఫరా తమ లక్ష్యమన్నారు. ఆయన వెంట ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈ వెంకటేష్‌ ఉన్నారు.

నేడు సామూహిక నిరాహార దీక్ష

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు(ఎస్టీఎఫ్‌ఐ )మేరకు టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సామూహిక నిరాహారదీక్షను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, గిరిబాబు, యాదయ్య, రమణాచారి, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement