అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే చేపట్టినట్లు హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో శుక్రవారం భూ రీసర్వేపై అవగాహన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే వల్ల భూ యాజమానులకు మేలు చేకూరుతుందన్నారు. అలాగే భూముల హద్దులు సృష్టంగా నమోదవడంతో భూ వివాదాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. రెవెన్యూ అధికారులు భూ కొలతలు నిర్వహించేటప్పుడు సంబంధిత భూ యజమానులు హాజరై హద్దుల ఏర్పాటుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహాసీల్దార్ సింహాచలం మధుసూదన్, గ్రామ సర్పంచ్ పత్తిపాక లావణ్య, పులికాశీ రమేష్, ఆర్ఐ యాదగిరి, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి


