హుస్నాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 5 వేల ఆర్టీసీ బస్సులను నడిపించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పందిల్ల గ్రామం నుంచి హుస్నాబాద్ బస్టాండ్ వరకు మంత్రి బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ప్రయాణికులకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రయాణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
క్యాంప్ కార్యాలయంలో రక్షాబంధన్
హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు మంత్రికి రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీలు కట్టిన మహిళా ప్రయాణికులు


