మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత
దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు.


