సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, అన్‌లోడింగ్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ రద్దీ, వివాదాలు, రవాణాలో జాప్యం తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, సివిల్ సప్‌లై, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


