ఉద్యోగం వదిలి..
నర్సాపూర్: స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో నెలకు రూ.35వేల ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో వచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాను. నా తండ్రి వెంకటేశ్‌గౌడ్ ప్రజా ప్రతినిధిగా గతంలో ఓటమి చెందడంతో తమ ఇంటి నుంచి ప్రజా ప్రతినిధిగా గెలవాలన్న నా తండ్రి కోరికను నెరవేర్చాను. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజా సేవ చేస్తూ ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.
– ఏ.సుధీర్‌గౌడ్, 2వ వార్డు కౌన్సిలర్, నర్సాపూర్


