పుర సేవ.. యువ తోవ | - | Sakshi
Sakshi News home page

పుర సేవ.. యువ తోవ

Mar 1 2026 8:39 AM | Updated on Mar 1 2026 8:39 AM

పుర స

పుర సేవ.. యువ తోవ

అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందజేస్తా..
తాము సైతం సమాజాభివృద్ధికి పాటు పడుతామంటూ యువతరంరాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో యువత కౌన్సిలర్స్‌గా పోటీ చేసి గెలిచింది. ఉన్నత చదువులు చదివిన యువతి, యువకులు చిన్న వయస్సులోనే ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. దుబ్బాక మున్సిపల్‌లో మొత్తం 20 వార్డులకు గాను ఐదుగురు 35 సంవత్సరాలలోపు వారే ఉండటం విశేషం. సదాశివపేటలో 26 వార్డుల్లో 6 వార్డుల్లో యువ కౌన్సిలర్లు, నర్సాపూర్‌లో చైర్‌పర్సన్‌ ఎం.లక్ష్మితో పాటు మరో నలుగురు ఉన్నారు. ‘సాక్షి’తో వార్డు కౌన్సిలర్లు వెల్లడించిన అభిప్రాయాలపై ఈ వారం కథనం.
మున్సిపాలిటీల అభివృద్ధిలో యువ కౌన్సిలర్లు ప్రజాసేవలో మార్క్‌ చూపించేందుకు కృషి అత్యధికులు ఉన్నత విద్యావంతులే..

చేర్యాల(సిద్దిపేట): డిగ్రీ పూర్తయిన తర్వాత మాస్టర్స్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ పీజీ చేశాను. అందులో సమాజం, స్థితిగతులు, జీవన విధానం, పేద ప్రజలకు అధికార యంత్రాంగానికి ఉన్న అంతరం తదితర అంశాలను తెలుసుకున్నాను. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లేనని భావించి, సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. బీఆర్‌ఎస్‌ నుంచి 2వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచాను. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరిస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను అర్హులకు అందేలా కృషి చేస్తా.

– కమలాపురం గీతాంజలి, 2వ వార్డు కౌన్సిలర్‌, చేర్యాల మున్సిపాలిటీ

గజ్వేల్‌: ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పని చేస్తా. 30ఏళ్ల వయసులోనే కౌన్సిలర్‌గా గెలిచాను. తనపై నమ్మకం ఉంచి చిన్న వయసులోనే వార్డు ప్రజలు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. వారి నమ్మకం వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తా. మౌళిక వసతులు కల్పించి, వార్దును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. వార్డు ప్రగతే ధ్యేయంగా పని చేస్తా.

– మన్నె రూప, 5వ వార్డు కౌన్సిలర్‌, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ

సదాశివపేట(సంగారెడ్డి): బీకాం చదివి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిని అవుతాననుకోలేదు. 19వ వార్డు బీసీ మహిళ రిజర్వు కావడంతో నా భర్త మాజీ కౌన్సిలర్‌ పట్లూరి నాగరాజ్‌గౌడ్‌ ప్రోద్బలంతో కౌన్సిలర్‌గా ఎన్నికల బరిలో నిలిచాను. ప్రజల ఆశీర్వాదంతో గెలిచాను. నాకు రాజకీయాలు కొత్త అయినా ప్రజలకు అందుబాటులో ఉంటాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

– రోజా పట్లూరి, 19వ వార్డు కౌన్సిలర్‌, సదాశివపేట

సదాశివపేట(సంగారెడ్డి): నాకు రాజకీయాలు కొత్తేమే కాదు. కాని కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం కొత్తే. నా తల్లి కొత్తగొల్ల అనురాధ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా, తండ్రి కొత్త గొల్ల కృష్ణ కౌన్సిలర్‌గా సేవలందించారు. 8 వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొంది మొదటి సారి మున్సిపాలిటీలో అడుగుపెట్టాను. వార్డు సమస్యల పరిష్కారం కోసం సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తా. – కొత్తగొల్ల సోమశేఖర్‌, 8వ వార్డు కౌన్సిలర్‌, సదాశివపేట

గజ్వేల్‌: వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ నుంచి పోటీ చేసి 26 ఏళ్ల వయసులో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాను. వార్డు పరిధిలోని సమస్యలపై అధ్యయనం చేసి దశల వారీగా పరిష్కరిస్తాను. అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

– కప్ప మమత, ఒకటోవార్డు కౌన్సిలర్‌, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌

హుస్నాబాద్‌: ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. వార్డులో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. తాగునీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతాను. ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. చిన్న వయస్సులోనే సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు రుణపడి ఉంటాను. కాగా హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 35 సంవత్సరాల వయస్సు లోపు ముగ్గురు కౌన్సిలర్లు విజయం సాధించారు. – చెన్నబోయిన అనూష,

ఒకటో వార్డు కౌన్సిలర్‌, హుస్నాబాద్‌ మున్సిపాలిటీ.

నర్సాపూర్‌ : నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం. పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచాను. విద్యార్థి దశలోనే పలు విద్యార్థి సంఘాల్లో పని చేశాను. రిజర్వేషన్‌ అనుకూలించడంతో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచాను. అందరి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తాను.

– ఎం.నిరంజన్‌దాస్‌, 11వ వార్డు కౌన్సిలర్‌, నర్సాపూర్‌

దుబ్బాక: నేను బీఎస్సీ చదివిన. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే చాలా ఇష్టం. నా భర్త సాయితేజగౌడ్‌, మా మామయ్య ప్రోత్సాహంతో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచాను. వార్డును అన్ని రంగాలో అభివృద్ధి చేస్తా.

– ఐరేని అఖిల, 20వ వార్డు కౌన్సిలర్‌, దుబ్బాక

ఆదర్శంగా తీర్చిదిద్దుతా

విద్యార్థి సంఘాల్లో పని చేశా

రాజకీయాలంటే ఇష్టం

పుర సేవ.. యువ తోవ1
1/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ2
2/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ3
3/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ4
4/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ5
5/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ6
6/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ7
7/8

పుర సేవ.. యువ తోవ

పుర సేవ.. యువ తోవ8
8/8

పుర సేవ.. యువ తోవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement