
తీజ్.. జోష్
జిల్లా కేంద్రంలో గురువారం తీజ్ సంబురం అంబరాన్నంటింది. గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన తీజ్ నిమజ్జన కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. మొదట భవానిదేవి, సంత్ సేవాలాల్ చిత్ర పటాల వద్ద తీజ్ (గోధుమ నారు)లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వేషధారణ, మన కట్టుబొట్టు, మన భాషే మన అస్థిత్వమన్నారు. ఎస్టీలకు అనేక ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మనం ఇతరులను గౌరవించడంతో పాటుగా మనం గౌవింపబడే విధంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి కోమటి చెరువులో తీజ్‌లను నిమజ్జనం చేశారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)