మెరుగైన వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించండి

Aug 14 2025 7:51 AM | Updated on Aug 14 2025 7:51 AM

మెరుగ

మెరుగైన వైద్య సేవలు అందించండి

యాంటీ డ్రగ్స్‌ వారియర్లుగా కదలాలి
● మాదక ద్రవ్యాలను అరికట్టాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు

హుస్నాబాద్‌: ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. నాషాయుక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే ప్రాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు. భవిష్యత్తు ముఖ్యమని, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆచూకి తెలిస్తే తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సీపీ అనురాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, ఎంఈఓ బండారి మనీల, పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

చేర్యాల(సిద్దిపేట): ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. బుధవారం ముస్త్యాల పీహెచ్‌సీ, మోడల్‌ స్కూల్‌ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అటెండెన్స్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. ఓపి రిజిస్టర్‌ చూసిన ఆమె ఎక్కువ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఎంత మంది వస్తున్నారు? అనే విషయాలను ఆరా తీశారు. అలాగే మందులు అందుబాటులో ఉన్నాయా, సీజనల్‌ వ్యాధులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్‌ వాతావరణం చాలా బాగుందన్నారు. ప్రణాళిక ప్రకారం సెలబస్‌ పూర్తి చేయాలని ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్‌ దిలీప్‌నాయక్‌, ఆర్‌ఐ తదితరులు ఉన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్‌ హైమావతి

మెరుగైన వైద్య సేవలు అందించండి 1
1/1

మెరుగైన వైద్య సేవలు అందించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement