
డ్రగ్స్, మత్తు పదార్థాలపై నిఘా
పోలీస్ కమిషనర్ అనురాధ
చిన్నకోడూరు(సిద్దిపేట): గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మాచాపూర్‌లోని బయో మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో 21.017 కిలో గ్రామ్స్ గంజాయిని కాల్చి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక డాగ్స్‌తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మత్తు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీపీ అనురాధ పోలీసు అధికారులకు సూచించారు. పరేడ్ గ్రౌండ్‌లో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.