గణనాథుడి సన్నిధిలో నాగర్‌కర్నూల్‌ జడ్జి | - | Sakshi
Sakshi News home page

గణనాథుడి సన్నిధిలో నాగర్‌కర్నూల్‌ జడ్జి

Nov 2 2026 9:18 AM | Updated on Nov 2 2026 9:18 AM

గణనాథుడి సన్నిధిలో నాగర్‌కర్నూల్‌ జడ్జి చదువుకు వయసుతో సంబంధం లేదు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ధనసిరి విద్యార్థులు రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంట్‌కు విద్యార్థి మీనాక్షి

ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్జి దంపతులు

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం సమీపంలో గణేశ్‌గడ్డ దేవస్థానంలో ఆదివారం నాగర్‌కర్నూల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిధి, ఆమె భర్త హైకోర్టు న్యాయవాది దశరథ్‌తో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి, జడ్జి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోశ్‌జోషి, జగదీశ్వర్‌ స్వామి, చంద్రశేఖర్‌, అయ్యప్ప, సతీశ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు.

జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి

జోగిపేట(అందోల్‌): చదువుకు వయసుతో సంబంధం లేదని, చదువు మధ్యలో ఆపేసిన ప్రతి ఒక్కరికీ ఓపెన్‌ ఇంటర్‌ ఒక గొప్ప అవకాశమని సంగారెడ్డి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జోగిపేటలో శనివారం నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్‌ తరగతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..టెన్త్‌, ఇంటర్‌ మధ్యలోనే చదువు ఆపేసిన వారి కోసమే ప్రభుత్వం ఈ ఓపెన్‌ స్కూల్‌ విధానాన్ని తెచ్చిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకుని మళ్లీ చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీ విఠల్‌, ఆంగ్ల అధ్యాపకులు శ్రీ గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌)ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలికల అండర్‌–17 ఖోఖో పోటీల్లో ధనసిరి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతిని గెలుచుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం.రమేశ్‌కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ మహేష్‌కుమార్‌లను ఆయన అభినందించారు.

హత్నూర (సంగారెడ్డి): హత్నూర మండలం దౌల్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మీనాక్షి రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంట్‌కు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కందప్ప ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 30, 31 తేదీలలో రెండు రోజులు హైదరాబాద్‌లో సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సోషల్‌ ఫోరం నిర్వాహకుల ఆధ్వర్యంలో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించగా దౌల్తాబాద్‌ పాఠశాలకు చెందిన మీనాక్షి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement