పల్లెల్లో సామాజిక ఇంకుడు గుంతలు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో సామాజిక ఇంకుడు గుంతలు

Nov 2 2026 9:18 AM | Updated on Nov 2 2026 9:18 AM

జహీరాబాద్‌ టౌన్‌: మురుగు నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండకుండా ప్రభుత్వం సామాజిక ఇంకుడు గుంతల (డ్రైయిన్‌ ఎండ్‌ సోక్‌ పిట్స్‌) నిర్మాణంపై దృష్టి పెట్టింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులతో వీటి నిర్మాణం పనులను చేపడుతోంది. గతంలో ఇంటింటికీ ఇంకుడు గుంత ఉండాలని విస్తృత ప్రచారం చేసినా ఆశించినస్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. ఈసారి డ్రైయిన్‌ ఎండ్‌ సోక్‌పిట్స్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని గ్రామాల్లో మురుగు కాల్వల చివరి స్థలాల్లో వీటిని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.

మండలంలో 18 మంజూరు

జహీరాబాద్‌ మండలంలో 18 గ్రామాలకు సామాజిక ఇంకుడు గుంతలు మంజూరు కాగా రాయిపల్లి(డి)లో 4, అనేగుంటలో 1, కాసీంపూర్‌లో 2, బుర్దిపాడ్‌లో 1, సత్వార్‌లో 2, శేఖాపూర్‌లో 1, తూంకుంటలో 1చొప్పున ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టారు. మరో ఆరు గ్రామాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డ్రైయిన్‌ ఎండ్‌ సోక్‌ పిట్స్‌ నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం కింద రూ.90 వేలు మంజూరు చేస్తున్నారు. ఇందులో రూ.60 వేలు ఎస్‌బీఎం నిధులు కాగా రూ.30 వేలు గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు ఉంటాయి.

గుంతలతో ప్రయోజనాలు

డ్రైయిన్‌ ఎండ్‌ సోక్‌ పిట్స్‌ నిర్మాణం వల్ల వీధుల వెంట మురుగునీరు నిల్వ ఉండకుండా నివారిస్తుంది. దోమలవ్యాప్తి తగ్గి, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వర్షపు నీటితో పాటు వృథా నీరు భూమిలోకి చేరడం వల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.

ఒక్కో గుంతకు రూ.90వేలు

ఇప్పటివరకు 12 పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement