న్యాల్‌కల్ (జహీరాబాద్): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. చేతికి వచ్చిన పత్తి పంటను తీసుకుంటున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీన ప్రభావం వల్ల అక్కడక్కడా వర్షపు జల్లులు పడుతుండటం, మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ వర్షపు జల్లులు పడ్డాయి. ఆదివారం కూడా ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులు పడ్డాయి. ఈ నెల 4 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
3,57,246 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో ఈ ఏడాది 3,57,246 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నారు. జిల్లాలో 27 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి పంట దెబ్బతింది. పంట దెబ్బతిని దిగుబడులు బాగా తగ్గి పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పత్తి పంట చేతికి వస్తుంది. పంటను తీసేందుకు స్థానికంగా కూలీల కొరత ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక కూలీ చెల్లించి కూలీలను రప్పిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడుతున్నాయి. దీంతో పొలంలో ఉన్న కొద్ది పంటను కూడా తీసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
జిల్లాలో అక్కడక్కడా వర్షాలు
మూడు రోజుల పాటు ఉంటాయన్న వాతావరణశాఖ
తాజా ప్రకటనతో పత్తి రైతులు


