వర్షాకాలంలో ఆశించిన వానలు కురవలేదు. ఫలితంగా పంట దిగుబడులు తగ్గాయి. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. రబీ పంటల సాగులో రైతులు అధికారుల సూచనలు పాటించాలి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి
పత్తి సాగు కోసం ఎకరాకు రూ. 25 వేలు వెచ్చించాం. అవసరమైన సమయంలో వానలు కురవలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. వస్తున్న దిగుబడి పెట్టుబడులకు సరిపోయోలా ఉంది. ప్రభుత్వం కరువును ప్రకటించి భత్యం చెల్లిస్తే తప్ప వ్యవసాయం ముందుకు సాగే అవకాశం లేదు. మద్దతు ధర రూ.12 వేలకు పెంచి రైతాంగాన్ని ఆదుకోవాలి.
– మల్లన్న, రైతు, యూసుఫ్‌పూర్


