ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ. 30 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకుడు హన్మంత్‌రావు పాటిల్, మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు శంకర్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామలింగారెడ్డి, మారుతీరావు పాటిల్, మల్లన్న పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా చంద్రశేఖర్ పాటిల్, సభ్యులుగా మల్లయ్య స్వామి, మల్లికార్జున్ పాటిల్, శ్రీనివాస్, నవాజ్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, మల్లన్న, లక్ష్మి, శివకుమార్, తిరుమ లేశ్, మలిశెట్టి, విఠల్‌రెడ్డి, ఈశ్వరప్ప, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బసయ్య స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీ సురేశ్‌షెట్కార్


